శివాలయం

శ్రీ గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వరస్వామివారి దేవాలయము కండ్లగుంట గ్రామంలో సుమారు 150 సంవత్సరాల కాలంలో పూర్వీకులు ప్రతిష్ఠ జరిపియున్నారు. సదరు దేవాలయమునకు నర్సారావుపేట జమీందారు గారు నిష్ఠ నైవేద్యములు శాశ్వతంగా జరుపుటకు దేవాలయ పూజారి గార్కి కొంత భూమిని ఇచ్చియున్నారు. మేళతాళములు జరుపుటకు కొంత భూమిని ఇచ్చియున్నారు. చాకిరి చేసే చాకలి వారికి కొంత భూమిని ఇచ్చియున్నారు. దేవాలయ అభివృద్ధికి కొంత భూమిని ఇచ్చియున్నారు. కొంత భూమిని దేవాలయము శాశ్వతంగా జరుపుటకు గ్రామ కరణంగారు అయిన పులిజాల వంశస్తులకు ఇచ్చియున్నారు.