పోలేరమ్మ తల్లి దేవాలయం

పూర్వం 150 సంవత్సరాల క్రితం కండ్లగుంట గ్రామంలో దేవాలయము ప్రతిష్ఠంపబడింది. కాన ఈ యొక్క దేవాలయము పాడైపోయినందున మరలా అన్ని వర్ణాల గ్రామ ప్రజలు కలిసి కొత్తగా దేవాలయము ప్రతిష్ఠ జరిగింది. ఈ యొక్క దేవాలయమునకు అన్ని వర్ణాల వారు పూజలు జరుపుతున్నారు. వివాహాల సందర్భంగా కొందరి వంశస్తులు అమ్మవారి కలశాన్ని వీరకత్తులు, వీరతాళ్ళతో, డప్పువాయిద్యాలతో కొలుపులు కొలుస్తారు. ఈ ఊరు వారికి ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. గ్రామంలో పెళ్ళి చేసుకొనే ప్రతి ఒక్కరు అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, డప్పువాయిద్యాలతో పసుపు, కుంకుమలు సమర్పించుకొని తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. దీనినే పోలేరమ్మకు నీళ్ళు పోయడం అంటారు. ఇది ఈ గ్రామంలో వస్తున్నా పురాతనమైన ఆచారం.