చెన్నకేశ టెంపుల్

ఈ గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవాలయం అతి పురాతనమైనది. 2007 లో దేవాలయ పునఃరుద్ధరణ సమయంలో బయటపడిన పురాతన విగ్రహాల ద్వారా ఇచ్చట దాదాపు 15వ శతాబ్దము నుండి దేవాలయం కలదని తెలుస్తుంది. ప్రస్తుతం త్రిభంగి రూపంలో ఉన్న స్వామివారి విగ్రహం దాదాపు 300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠంపబడి గ్రామ ప్రజలచేత పూజలందుకుంటూ ఉంది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద మరియు శాసనాలు దాగి ఉన్నాయి. ఈ గుడిలో ఉపదేవాలయలు ఉన్నాయి.

ఈ గ్రామంలోని శిథిలావస్థలో ఉన్న “శ్రీ భూనీళా సమేత శ్రీ చెన్నకేశవస్వామి” వారి దేవాలయాన్ని సుమారు 1885వ సంవత్సరంలో “శ్రీ చెరుకూరి చౌదరమ్మ” గారు పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. సదరు దేవాలయానికి నిత్య ధూప,దీప నైవేద్యాలు వంశపారంపర్యంగా చేయడానికి పూజారి గార్కి ఐదు ఎకరంల స్వంత భూమిని ఇచ్చియున్నారు. దేవాలయంలోని భజంత్రీలకు చాకిరి నిమిత్తం పన్నెండు ఎకరంల స్వంత భూమిని ఇచ్చియున్నారు. ఈ విధంగా వారి యొక్క వంశ పారంపర్వంతం జరిగేటట్లు వారు ఏర్పాటు చేసియున్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవం ఏరువాక పూర్ణమి నాడు జరుపుతారు. ఉదయం గణపతి అవాహన పుణోహవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణ, స్థాపిత దేవతల అభిషేకములు, అగ్ని ప్రతిష్ఠాపన, కుంకురార్పణ, మంత్రపుష్ఫం అనంతరం, కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల ఇలవేల్పు దైవంగా ప్రసిద్ధి గాంచిన “శ్రీ భూనీళా సమేత శ్రీ చెన్నకేశవస్వామి” వారి కల్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పూర్ణమి ( ఏరువాక పూర్ణమి) జరుగుతాయి. స్వామి వారి కల్యాణ మహోత్సవం రోజున స్వామి వారిని దర్శించుకున్నవారికి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, కోరిన కోరికలు తీర్చే దేవునిగా ఊరందరికీ విశ్వాసం. ముఖ్యముగా సంతాన ప్రాఫ్తి ప్రసాధించే స్వామివారిగా భక్తుల ప్రగాడ విశ్వాసం. అందుకు తార్కాణం గ్రామంలోని చాలామంది పేర్లు చెన్నయ్య, చెన్నకేశవులు, కేశవులు అని పేర్లు చాలామంది గ్రామస్తులకు ఉండటమే తార్కాణం. భక్తులు స్వామివారికి విశేష పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందుకుంటారు. ధనుర్మాసంలో జరిగే వ్రతము, ముక్కోటి, కనుములకు స్వామివారి ఊరేగింపు, దేవీ నవరాత్రులు, వార్షిక పండుగలు పంతొమ్మిది, మండల పూజాకార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరుగుతాయి.