బొడ్డురాయి(నాభిశిల)

కలరా మసూచి మొదలగు సాంక్రామిక సాంఘిక వ్వ్యాధులు, పశువ్యాధులు సోకకుండా ఉండేందుకు గ్రామవాసులు పూజించుటకై నిలువున నాటిన పెద్దరాయి. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా గ్రామ మధ్యమున నెలకొల్పిన శిల. గ్రామ నడిబొడ్డున అరుగువలే అమర్చిన పెద్దబండ. గ్రామ నడిబొడ్డున అరుగువలే అమర్చిన పెద్దబండనే బొడ్రాయిగా రూపాంతరము చెంది, ఈ గ్రామములో బొడ్రాయిగా లేదా బొడ్డురాయి లేదా నాభిశిలగా పిలిచెదరు. గ్రామమున అరిష్టము లేర్పడినప్పుడు, కుమ్మరులు గ్రామప్రజల పక్షమును యీ రాతిని పూజించి, వడపప్పు పానకములను పంచిపెట్టుదురు. గ్రామంలో జరిగే పెళ్ళి లాంటి శుభకార్యాలన్నింటిలోనూ ఈ రాయి దగ్గరకు వచ్చి పూజాదులు చేసి వెళ్లుదురు.