శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానం

గ్రామంలో బ్రహ్మంగారి గుడిగా ప్రసిద్ధిచెందినది. ఈ గుడి కాలక్రమేణా శిథిలమైపోవడం మొదలైంది. శిథిలమైన ఈ ఆలయాన్ని 1998వ సంవత్సరంలో శ్రీ పడకండ్ల వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో పునఃనిర్మాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ విగ్రహాలతోపాటు, ఈశ్వరీమాత, సిద్ధయ్య విగ్రహల ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ఆలయంలో గోవిందమాంబా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ గుడి ఆలనాపాలనా వ్యవహారాలన్నీ.. “గుడి నిర్మాణ దాత శ్రీ పడకండ్ల వెంకటేశ్వర్లు” ఎంతో ఆప్యాయతతో నిర్వహిస్తున్నారు.