శ్రీ బాలవినాయకుడి గుడి

గ్రామంలో వేంసేసియున్నటువంటి బాలవినాయకుని గుడి 1968వ సంవత్సరం గుంటుపల్లి సుబ్బమ్మ గారి కోరిక మేరకు శ్రీ జంపని పెద రాఘవయ్య గారు ప్రతిష్ఠ జరిపినారు. నిత్య దూప, దీప నైవేద్యాలు మరియు ఉత్సవాలు జరుపుట కొరకు కొంత మాన్యం మరియు కొంత డబ్బు ఇచ్చారు. ఈ గుడి నిర్మాణంలో శ్రీ జంపని శేషయ్య గారు విశేష కృషి చేసి, ‘ఉడతాభక్తి’గా ఇప్పటికీ స్వామివారికి

గ్రామంలో వేంసేసియున్నటువంటి బాలవినాయకుని గుడి 1968వ సంవత్సరం గుంటుపల్లి సుబ్బమ్మ గారి కోరిక మేరకు శ్రీ జంపని పెద రాఘవయ్య గారు ప్రతిష్ఠ జరిపినారు. నిత్య దూప, దీప నైవేద్యాలు మరియు ఉత్సవాలు జరుపుట కొరకు కొంత మాన్యం మరియు కొంత డబ్బు ఇచ్చారు. ఈ గుడి నిర్మాణంలో శ్రీ జంపని శేషయ్య గారు విశేష కృషి చేసి, ‘ఉడతాభక్తి’గా ఇప్పటికీ స్వామివారికి సేవలందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో గుంటుపల్లి, కంఠమనేని మరియు జంపని వంశస్తులూ పాల్గొని గుడి నిర్మాణంలో భాగాస్వాములైనారు.

ఈ గుడికి వెనుకవైపు వేప చెట్టు గుబురుగా కనిపిస్తుంది. ఈ వేపచెట్టును శ్రీ బండ్లమూడి వెంకట్రామయ్య గారు ఊరందరూ ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకొనుటకు సిమెంటు అరుగు మరియు తాటాకులు, వెదురు కర్రలతో కప్పును తమ స్వంత ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేప చెట్టు గుబురుగా ఉండటంతో చల్లటి ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామస్థులు, ప్రయాణికులు ఏ మాత్రం ఖాళీ ఉన్నా ఈ చెట్టు నీడలో సేదదీరుతారు. వేసవిలో ఖాళీ ఉండకుండా ఇదే అరుగు మీద గ్రామీణ ఇండోర్ ఆటలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఊరిలో ఏమూలకెళ్లినా పలానా చెట్టు ఎక్కడ అంటే టక్కున చెప్పేస్తారు. దీనినే వినాయకుని గుడి సెంటర్ అంటారు. పూర్వం ఈ ప్రాంతాన్ని యర్రం వాళ్ళ బావి అనేవారని ఊరి పెద్దలు చెప్తారు.