శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

ఇదే దేవాలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహ సమేత ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం, శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం అంతర్భాగంగా కొలువై ఉన్నాయి. మానసిక వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు శ్రీ వీరాంజనేయస్వామివారికి ( 40రోజులు) మండలం ప్రదక్షిణలు చేసినట్లయితే వారి సమస్యలు తీరటం ఇక్కడ గమనార్హం. 2009లో ఈ దేవాలయం గ్రామస్థులు, వంశపారంపర్య ధర్మకర్తల సహాయ సహకారాలతో పునరుద్దరించబడింది. ఈ గుడి సముదాయ ఆలనాపాలనా వ్యవహారాలన్నీ.. “చెరుకూరి వారి వంశస్తులు” ఎంతో ఆప్యాయతతో నిర్వహిస్తున్నారు.