శ్రీ రామాంజనేయ మీ సేవ కేంద్రం

      కండ్లగుంట గ్రామ ప్రజలకు నేరుగా సేవలందించాలన్న లక్ష్యంతో రామాలయంనకు ఎదురుగా "శ్రీ రామాంజనేయ మీ సేవ కేంద్రం" ను ప్రభుత్వ అనుమతితో శ్రీ మొగిలి వీరాంజనేయులు (సి.యస్.సి. ఆథరైజ్డ్ సెంటర్ నంబర్: APOPR02785 తేది 12-04-2014) స్వహస్తాలతో ప్రారంభించారు. 'మీ సేవ' కేంద్రంలో కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, జిరాక్స్, ఇంటర్నెట్ సౌకర్యంతో నెలకొల్పారు. మీ సేవ ద్వారా రెవెన్యూ, పురపాలక, రవాణా, పౌర సరఫరాలు, ఆధార్‌, ఎన్నికలు, విద్య, వ్యవసాయ, కార్మిక, సాంఘిక సంక్షేమ, జనన-మరణ సర్టిఫికెట్లు, వాణిజ్య, పారిశ్రామిక, విద్యుత్‌ శాఖ బిల్లులు, భూగర్భగనుల శాఖలకు చెందిన సేవలను ఇక్కడ పొందవచ్చు. ‘మీ సేవ’కు అనేక సేవల కోసం వచ్చే వినియోగదారుల నుంచి ధరల పట్టికలో నిర్దేశించిన రుసుము మాత్రమే వసూలు చేస్తూ, పూర్తి పారదర్శకతతో సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి అదనపు రుసుమూ వసూలు చేయడం లేదు.

      మీ-సేవ కేంద్రం ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరచి ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు మాత్రమే భోజన విరామం సమయం. ఆదివారం, ప్రభుత్వ సెలవుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరచి ఉంటుంది.

      మీ-సేవ కేంద్రం అడ్రసు:- శ్రీ మొగిలి వీరాంజనేయులు, ఫొన్ నంబరు: +91 9866552512, శ్రీ రామాంజనేయ మీ సేవ కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బిల్డింగ్, రామాలయంనకు ఎదురుగా, కండ్లగుంట గ్రామం, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522603.