పాఠశాల విద్యాభివృద్ధి కమిటీ నిర్వహణ తీరు

1. గ్రామంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, పూర్వవిద్యార్ధులు అందరం కలిసి సంవత్సరాల వారీగా పాఠశాలకు గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని బడిని బాగుచేయాలి.
2. ఉపాధిహామి కూలీలు, బడికి గతంలో సహయం చేసిన విద్యాదాతలు వీరందరితో కలిపి ఎంచుకున్న తొలి రోజున కలవాలి.
    * బడి పైన చర్చ.
    * అపోహలు తొలగించడం
    * ఉపాద్యాయులను గౌరవించేలా బడికి చేయూతనివ్యడం.
    * బడి మౌలిక అవసరాల మీద చర్చ.
    * ప్రభుత్వ పరంగా చేయాల్సినవి, స్ఠానిక పంచాయతి చేయాల్సిన పనులు.
    * వచ్చిన సభ్యులతో తరగతుల వారిగా భాద్యతలు కేటాయించడం.
3. పూర్వ ప్రాథమిక నుండి పదవ తరగతి వరకు తరగతికి ఐదుగురి చొప్పున కమిటీని ఏర్పాటు చేసి, ఆ 50-55 మందితో వేసిన కమిటీలో ఐదుగురిని క్లాసు కన్వీనర్, వసతుల ఇంచార్జ్, తల్లిదండ్రుల ప్రతినిధి, అకాడమిక్ ఇంచార్జ్, కార్యక్రమాల ఇంచార్జ్ లుగా చేసుకోవాలి. ఈ కమిటీలను ప్రతి సంవత్సరం ఎన్నుకొనేల చూసుకొని, వారికి పూర్వ విద్యార్ధులు అదనంగా సహకరించేలా చూసుకోవాలి. ఈ పది తరగతుల కమిటీల నుండి ఒక్కరిని పాఠశాల కమిటీ ఎన్నుకోవడం మరియు తరగతి కమిటీలో ఇద్దరు మహిళలు ఉండేలా చూసుకోవాలి.
4. కనీసం రోజు రెండు గంటలపాటు ఆడిస్తూ పాడిస్తూ, చదివించడానికి కనీస ప్రాథమిక సూత్రాలు చెప్పడం, చదవడం, రాయడం, చతుర్విద గణిత ప్రక్రియలు నేర్పించడం, పాఠ్యెతర పుస్తకాలు చదివించడం, యోగా, ద్యానం, బృంద చర్చలు, బాలసభ ఏర్పాట్లు చేసి పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేటట్లు చేయాలి.
  పాఠశాల కమిటీలో - నలుగురు కార్యవర్గ సభ్యులు
    1. అధ్యక్షుడు
    2. ఉపాధ్యక్షుడు
    3. కార్యదర్శి
    4. సహాయ కార్యదర్శి
గ్రామ విద్యాభివృద్ధి కమిటీకి గ్రామ సర్పంచ్ ని గౌరవ అధ్యక్ష స్థానంలో ఉంచాలి.
ప్రధానోపాద్యాయులు విద్యాభివృద్ధి కమిటీకి ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తాడు.