నిధుల సేకరణ

1. విద్యాపోషకుల సభ్యత్వం: విద్యా సంవత్సరానికి గాను రోజుకు ఒక రూపాయి చొప్పున విద్యాదాతల నుంచి సంవత్సరానికి 365/- రూపాయలను రెండు, మూడు విడతల వారిగా జమ చేసుకోవడం.
2. యువజన సంఘాలను లక్ష్యంగా తీసుకొని వారి వంతు భాగస్వామ్యంతో గ్రామ విద్యాభివృద్ధికి నిధులు సేకరించడం.
3. గ్రామ విద్యాభివృద్ధి కమిటీకి ప్రతి ఒక్క మహిళా స్వయం సహకార సంఘం కనీసం వెయ్యి రూపాయల విరాళం ఇచ్చేలా ప్రోత్సహించడం.
4. పూర్వ విద్యార్థులు తరగతులను దత్తత తీసుకోవడం.
5. కార్యక్రమాల వారిగా దాతలను ఎంపిక చేసుకోవడం.
6. ప్రతి వారం బాలసభ, బాల గ్రంథాలయం, బహుమతులు, మౌలిక వసతులకు ప్రత్యేక దాతలను ఎంపిక చేసుకోవడం.
7. విద్యా పోషకలు, పూర్వ విద్యార్థులు, యువజన సంఘాలు, మహిళ స్వయం సహయక సంఘాలు, ఉపాధ్యాయులు కనీసం లక్ష రూపాయలు లక్ష్యంగా విరాళాలు సేకరించాలి.
ఈ మొత్తానికి కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్ దాతల సహకారంతో మరో 25,000/- రూపాయలు సమకూరుస్తుంది. ప్రాథమిక పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు కార్యకర్తలు నియామకం చేసుకోవాలి. ఎంత వేతనం ఇవ్వాలో కమిటీ నిర్ణయిస్తుంది.

బ్యాంక్ లావాదేవీలు

* ప్రధానోపాధ్యాయులు - అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు.
* కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్ ప్రతినిధి కలిపి జాయింట్ అకౌంట్ అందుబాటులో ఉన్న బ్యాంకులో, వీలైతే కండ్లగుంట గ్రామంలోని సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియాలో ఖాతా తీసుకోవాలి.
* కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్ నుండి మరొక అవకాశం క్రింద విద్యాభివృద్ధి అవసరాలకు ఒక ఎన్.ఆర్.ఐ ని లేదా ఒక కార్పొరేటు కంపెనీనో ఎంపికచేసి ఇవ్వబడుతుంది.
* పాఠశాలకు సంబంధాలున్న బ్యాంక్ అకౌంట్, ఇ-మెయిల్ ఇవ్వబడుతుంది.