వ్యవసాయ సహకార పరపతి సంఘం

      వ్యవసాయం చెరువుల క్రింద, నాగార్జునసాగర్ కాలువల క్రింద సాగుచేయడం జరుగుతుంది. వ్యవసాయానికి ఆర్థిక సహాయనిమిత్తం గ్రామంలో నెంబరు. Z 121 చీమలమర్రి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్, గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు తమ సేవలను అందిస్తున్నాయి. రైతులకు సబ్సీడితో మందుకట్టలు, పంట రుణాలు అందించుచున్నారు. ఆఫీసు కొరకు మరియు మందుకట్టలు నిల్వచేసుకునే నిమిత్తం పి.ఎ.సి.ఎస్.లో గోదాము సౌకర్యం ఉంది. గోదాము నిర్మాణానికి అలపర్తి రత్తమ్మ-అచ్చయ్య గార్ల కుమార్తె శిగురుపాటి ఆది లక్ష్మమ్మ-నాగేశ్వరరావు గార్ల కుమార్తె అంజనీదేవి స్థలదానం చేయడమైనది. గోదాము నిర్మాణానికి శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేకర్ రావు, D.C.C.B చైర్మన్, శ్రీ వట్టికుంట వెంకటేశ్వర్లు, P.A.C.S. అధ్యక్షులు చేసిన కృషి అభినందనీయం.

ప్రస్తుత అధ్యక్షులు: గంగవరపు నాగేశ్వరరావు || ఫోన్ నంబరు: 9533441884 * చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: పూదోట అంతయ్య || ఫోన్ నంబరు: 9908200712