ప్రధాన పంటలు

      కండ్లగుంటలోని ఉన్నత పాఠశాలలో ఒక పెద్ద మంచినీళ్ళ బావి ఉంది. ఇది దాదాపు 150 సంవత్సరాలుగా ఊరందరి గొంతు తడుపు చున్నది. గ్రామంలో రెండు పెద్ద చెరువులు కూడా ఉన్నాయి. వీటి కింద కొన్ని వందల ఎకరాల ఆయకట్టు సాగు అవుచున్నది. గుంటూరు బ్రాంచి కెనాల్ గా పిలువబడే నాగార్జునసాగర్ కుడి కాలువ నేరుగా గ్రామం నుంచే వెళ్తోంది. కండ్లగుంట గ్రామస్తుల ప్రధాన జీవనాదారం వ్యవసాయం. వరి ప్రధాన పంట. వరి, మొక్కజొన్న, మిరప, పత్తి ప్రధాన పంటలగాను.. మినుము, పెసర, కంది అంతర పంటలగాను ప్రత్యేక గుర్తింపు ఉంది. ఊరి మీదగా ప్రవహిస్తున్న నాగార్జునసాగర్ కుడి కాలువ కారణంగా గ్రామంలోని మెట్ట ప్రాంతాలలో సైతం రైతులు పంటలు సాగు చేస్తూ మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. వాణిజ్య పంటలు కూడా కండ్లగుంటలో సాగవుతున్నాయి.

      చెరువు వైశాల్యం: చింతల చెరువు వైశాల్యం: 14.31 ఎకరాలు (సర్వే నెం: 477-B), చింతల చెరువు వైశాల్యం: 0.36 ఎకరాలు (సర్వే నెం: 477-G), చెరువు కుంట వైశాల్యం: 6.68 ఎకరాలు (సర్వే నెం: 470), మొత్తం చెరువు-కుంటల వైశాల్యం: 21.35 ఎకరాలు, పంట పొలాల వైశాల్యం: సాగు వైశాల్యం: 2413.35 ఎకరాలు, పోరంబోకు స్థలం వైశాల్యం: 443.31 ఎకరాలు, మొత్తం మెట్ట-మాగాణి సాగు వైశాల్యం: 2856.66 ఎకరాలు / అసైన్డ్ స్థలం వైశాల్యం: 105.74 ఎకరాలు, సభ్యులు: 167 మంది / గ్రామం మొత్తం వ్యవసాయ పొలం వైశాల్యం: 2856.66 ఎకరాలు.

గ్రామ ప్రధాన పంటలు: వరి, పత్తి, మొక్కజొన్న, మిరప.

గ్రామ అంతర పంటలు: కందులు, మినుము, పెసర.