కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే

'పల్లెకు పోదాం...'

ఆత్మీయ సమావేశ సంబరాలు జనవరి 14 మరియు 15 వరకు జరుగును.

స్వాగతం - సుస్వాగతం

‘జననీ జన్మభూమిశ్ఛ స్వర్గాదపీ గరీయసీ’ అన్నారు మన పెద్దలు. కన్న తల్లి , పుట్టిన ఊరు స్వర్గం కన్నా గొప్పది అని దీని భావం. కన్నతల్లి మీదా, పెరిగిన పురిటిగడ్డ మీద ఉన్న మమకారంతో పురిటిగడ్డకు ఏదైనా చెయ్యాలనే సంకల్పం అందరికి ఉంటుంది. ఇలా అనుకుంటున్న మనందరం కలిస్తే మన గ్రామ అభివృద్ధికి మనమే సోపానాలు వేసుకోవచ్చు. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే మన ఊరిని ఒక్కసారి తలుచుకుంటే చాలు తియ్యటి జ్ఞాపకాలు కళ్ళముందు తేలియాడతాయి. ఆ కమ్మటి జ్ఞాపకాలను, ఆ మధురస్మృతులను, మన పురిటిగడ్డ విశేషాలు, చిన్ననాటి అనుభూతులు పదిమందితో పంచుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలానే రాను రాను భావితరాలకి గ్రామంతో ఉన్న సంభంద-బాందవ్యాలు, గ్రామ సమాచారం, వార్తలు, ఇంకా మరెన్నో విశేషాలకు ఒక వారధిని నిర్మించాలన్న ఆలోచనతో అందరికీ సమాచారం తెలుగులోనే అందివ్వాలన్న మా ప్రధాన ఆశయానికి కార్యరూపమే కండ్లగుంట.ఓ ఆర్ జీ (kandlagunta.org) వెబ్ సైట్ కు నాంది. అలానే ఒక్కో వ్యక్తి ఇంకొకరికి స్ఫూర్తి నిచ్చి, గ్రామ అభివృద్ధికై పాటుపడుతూ, మన పల్లెను ఇంకొన్ని ఊళ్ళూ ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించే విధంగా అభివృద్ధి పథంవైపు నడిపిద్దాం. మీరూ ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకుని మన ఊరి గురించి మీకు తెలిసిన సమాచారం అందించి మాకు ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నాము.

గ్రామం: కండ్లగుంట
మండలం: నకరికల్లు
శాసనసభ నియోజకవర్గం: సత్తెనపల్లి
లోక్ సభ నియోజకవర్గం: నరసరావుపేట
జిల్లా: గుంటూరు
పిన్ కోడ్: 522603
భాష: తెలుగు
గ్రామ జనాభా: 3766
పురుషులు: 1840
స్త్రీలు: 1926
కుటుంబాల సంఖ్య: 998
గ్రామ అక్షరాస్యత: 79%
గ్రామ విస్తీర్ణం: 20.35
గ్రామ సాగు భూమి: 2856.66 ఎకరాలు
అక్షాంశాలు & రేఖాంశాలు: 16°20’19.58” N 80°01’16.07” E
సముద్ర మట్టం నుండి ఎత్తు: 106 మీటర్లు లేదా 347.68 అడుగులు